ప్రతి పేదవారు ఉన్నత విద్యను అభ్యసించాలని భావించి, దానికి అనుగుణంగా విద్యా సంస్థలను ఏర్పాటు చేసిన భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని అదనపు కలెక్టర్ మెంచు నగేష్ పేర్కొన్నారు. సోమవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ 136వ జయంతిని పురస్కరించుకొని మెదక్ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.