ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్ కౌంటర్ జరిగింది. సుక్మా-బీజాపూర్ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. మరోవైపు అపపల్లి పరిధిలోని ముర్దండ గ్రామంలో రాష్ట్ర పోలీసులు, CRPF 229 బెటాలియన్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో IED బాంబును గుర్తించి పేల్చి వేశారు.