జమ్ముకశ్మీర్‌లో భారీ
భూకంపం వచ్చింది. మంగళవారం ఉదయం 7:38 గంటలకు ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.7గా నమోదైంది. లడఖ్‌లోని కార్గిల్ పట్టణానికి ఉత్తరాన 401 కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించారు. ఈ
భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ప్రకటించింది.