మంచిర్యాల: ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
మంచిర్యాల పట్టణంలో బుధవారం బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు సంతోష్ హాజరై మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో హైడ్రా పేరుతో హైడ్రామా సృష్టిస్తోందని అన్నారు. ఎన్నికల సందర్భంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేసిందని ఆరోపించారు.