మంచిర్యాల జిల్లా న్యాయస్థానానికి శాశ్వత భవనం నిర్మించాలని మంచిర్యాల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బండవరం జగన్ కోరారు. ఈ మేరకు మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద మంగళవారం మౌన దీక్ష చేపట్టారు. అద్దె భవనంలో న్యాయస్థానం ఉండడంతో పలు ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి ఇవ్వాలని కోరారు.