సింగరేణిలో కొత్తగనులు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని హెచ్ఎంఎస్ మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ జే. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల సింగరేణిలో కొత్త గనులు రాక విధ్వంసం మొదలైందన్నారు. వెంటనే ఆర్కే ఓసీ, కేకే 6, శ్రావణపల్లి ఓసిలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.