మంచిర్యాల మహిళ పోలీస్ స్టేషన్ లో నమోదైన మూడు కేసుల్లో నిందితులై, కోర్టులో హాజరుకాని ముగ్గురిని గురువారం అరెస్టు చేసినట్లు సీఐ నరేష్ తెలిపారు. మంచిర్యాల జడ్జి ఉషనిషద్విని ఉత్తర్వుల మేరకు నస్పూర్ కు చెందిన తనుగుల నారాయణ, పులి తిరుపతి, మందమర్రికి చెందిన తీగల శంకర్ లను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు సిఐ పేర్కొన్నారు.