దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీకమాసం ప్రారంభం నుంచి భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 584 జంటలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నోముకున్నారు. సన్నిధి ద్వారం సమీపంలోని రావిచెట్టు వద్ద భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు.