అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని డీసీపీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ అన్నారు. శనివారం మంచిర్యాల పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని అన్నారు.