సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి

62பார்த்தது
సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి
దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఐఎన్టియుసి అధ్యక్షుడు జనక్ ప్రసాద్ ను కోరారు.. ఈ మేరకు మందమర్రిలో ఆయనను కలిసి వినతి పత్రం సమర్పించారు. 11వ వేజ్ బోర్డు ప్రకారం పెరిగిన పింఛన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ కార్మికులకు తమ క్వార్టర్లను అప్పగించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఆయన యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி