చెన్నూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో శనివారం ఎమ్మెల్యే గడ్డం వివేక్ పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. మందమర్రిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, మురికి కాలువ నిర్మాణ పనులు, సెప్టిక్ ట్యాంక్ పైప్ లైన్ నిర్మాణ పనులకు, ఇతర వార్డుల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. జైపూర్ లో సింగరేణి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.