బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీకి చెందిన ఆలేటి మౌనిక ఇటీవల ప్రకటించిన డీఎస్సీ ఫలితాల్లో మంచిర్యాల జిల్లాలో తృతీయ స్థానం సాధించింది. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లో ఉద్యోగం పొందింది. తల్లిదండ్రులు సుజాత, లక్ష్మణ్ కూతురు మౌనిక వారి ప్రోత్సాహంతో మొదటి నుంచి చదువులో రాణించింది. ప్రయివేట్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించింది.