బెల్లంపల్లి ఏరియాలో కార్పొరేట్ ప్రాజెక్టు అండ్ ప్లానింగ్ (సీపీపీ) జీఎం ఎ. మనోహర్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఓసీ ఉత్పత్తి తీరును బెల్లంపల్లి జీఎం శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నారు. ఉల్లిపిట్ట, డోర్లి గ్రామాలకు వెళ్లే మార్గంలో వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యాలపై చర్చించారు.