తాండూర్ మండలం అచ్చులాపూర్ గ్రామంలోని నలుగురు అభ్యర్థులు డిఎస్సీలో ఒకే ప్రయత్నంలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారు. ఆంజనేయులు స్కూల్ అసిస్టెంట్, మానస, రవళి, మానసలు ఎస్జిటి టీచర్లుగా ఉద్యోగాలు సాధించారు. వీరి తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ చదివించగా ఉద్యోగాలు సాధించారు. వీరిని గ్రామస్తులు శనివారం ప్రత్యేకంగా అభినందించారు.