ఉత్తమ పద్ధతుల ద్వారా పత్తి పంట ఉత్పాదకతను పెంచవచ్చని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ కోట శివకృష్ణ తెలిపారు. సోమవారం జాతీయ పత్తి పరిశోధన నాగపూర్ బెల్లంపల్లి కెవికె సంయుక్తంగా నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల జిల్లాలో 425 ఎకరాల్లో రైతు క్షేత్రాలు ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ యువతకి తేనెటీగల పెంపకంపైన కూడా శిక్షణ ఇచ్చారు.