యువత వివేకానందుని స్ఫూర్తితో జీవితంలో ముందుకు సాగాలని సరస్వతి శిశు మందిర్ పాఠశాలల విభాగ్ అకాడమిక్ ఇంచార్జి పూదరి సత్యనారాయణ అన్నారు. ఆదివారం బెల్లంపల్లిలోని శ్రీ సరస్వతి శిశు మందిరం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పూర్వ విద్యార్థి పరిషత్ ప్రబంధకారిని ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. వివేకానందుని ఆశయాలకు అనుగుణంగా యువత పాటుపడాలన్నారు.