బెల్లంపల్లి: శాంతిఖనీ ఉన్నత పాఠశాలలో ఉగాది వేడుకలు

63பார்த்தது
బెల్లంపల్లి: శాంతిఖనీ ఉన్నత పాఠశాలలో ఉగాది వేడుకలు
బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పాఠశాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉగాది పర్వదినం విశిష్టత విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. ఉగాది పచ్చడిని తయారుచేసి విద్యార్థులకు అందజేశారు. అనంతరం విద్యార్థులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி