బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు ఆదివారం నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు పెండింగ్లో ఉన్న ఆరు నెలల వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పిఎఫ్ కూడా చెల్లించడం లేదని పేర్కొన్నారు.