బెల్లంపల్లి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బోయిని కొమురయ్య శనివారం మృతిచెందారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆయన మృతదేహం వద్ద పూలమాలవేసి నివాళులు అర్పించారు. మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ గా విధులు నిర్వర్తించారని ఆయన సేవలను కొనియాడారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాడ సానుభూతి తెలియజేశారు. ఆయనతోపాటు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్ ఉన్నారు.