బీహార్‌లో దారుణం జరిగింది. పరీక్షలో ఆన్సర్స్ చూపించలేదని తన ఫ్రెండ్‌నే కాల్చి చంపాడు. రోహ్తాస్ జిల్లాకు చెందిన అమిత్, సంజిత్ టెన్త్ బోర్డు ఎగ్జామ్ రాస్తుండగా తనకు ఆన్సర్స్ చూపించాలని మరో బాలుడు కోరాడు. అందుకు వీరు నిరాకరించారు. ఎగ్జామ్ రాసి వీరు ఇంటికి వెళ్తుండగా బాలుడు వీరిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అమిత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, సంజిత్ పరిస్థితి నిలకడగా ఉంది.