పిల్లిని కాపాడబోయి ఓ వ్యక్తి మరణించిన ఘటన కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సిజో మంగళవారం రాత్రి షాపింగ్ చేసి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు మధ్యలో ఓ పిల్లి పిల్ల కనబడగా వాహనం డీ కొడతాదేమోనని దానిని కాపాడటానికి పరిగెత్తాడు. అయితే అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన సిజోను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.