వనపర్తి మునిసిపల్ కార్యాలయంలో తొమ్మిది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని కాంట్రాక్టు ఉద్యోగులు తెలిపారు. పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మునిసిపల్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. జీతాలు చెల్లించాలని కోరారు. కార్మికుల దీక్షకు బిఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. జీతాలు చెల్లించాలని నేతలు ఉంగ్లం తిరుమల్, నందిమల్ల అశోక్ డిమాండ్ చేశారు.