వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వెనక భాగంలో ఉన్న వసతి గృహ భవనాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం పరిశీలించారు. వసతి గృహ భవనానికి అవసరమైన మరమ్మతులు త్వరగా పూర్తి చేసి ఇవ్వాలని రోడ్లు భవనాలు శాఖ డీఈను ఆదేశించారు. భవనం మరమ్మతులు పూర్తి అయితే భవనాన్ని విద్యార్థులకు ఉపయోగంలోకి తీసుకురావచ్చని తెలిపారు.