వనపర్తి జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ 2వ మహాసభలు మంగళవారం రాఘవ, మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కార్యదర్శి డి. కిరణ్ నివాళులర్పించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు రజనీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని, ఫీజు రీయంబర్స్ మెంట్స్, స్కాలర్ షిప్స్, వసతిగృహాలకు సోంత భవనాలు, విద్యాభరోసా, తదితర హామీలను అమలు చేయాలన్నారు.