ప్రజల సమస్యల పరిష్కారానికే పోలీస్ ప్రజావాణి ఉపయోగపడుతుందని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. 03 భూ ఫిర్యాదులు, 02 పరస్పర గొడవలకు సంబంధించిన మొత్తం 5 అర్జీలు అందాయని తెలిపారు.