మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సరళ సాగర్ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మదనపురం మండలంలోని ఊకచెట్టు వాగు బ్రిడ్జి దగ్గర నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండడంతో రాకపోకలను నిలిపివేస్తున్నట్లు మంగళవారం మదనాపురం ఎస్ఐ తెలిపారు. మదనాపురం, ఆత్మకూరు మండలాలకు వెళ్లే వాహనదారులు రామన్ పాడ్ ప్రాజెక్ట్ పై నుంచి వెళ్లాలని పోలీసులు సూచించారు.