ఆహారంలో అయోడిన్ కలిగిన ఉప్పు తినడం వలన అనేక లాభాలు ఉన్నాయని ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల, జిల్లా వైద్యశాఖ అధికారి సౌభాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం ప్రపంచ అయోడిన్ లోప రుగ్మతల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట ఆర్డీవో కార్యాలయం నుండి నిర్వహించిన ర్యాలీని జండా ఊపి ప్రారంభించారు. విస్కీస్ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అయోడైడ్ ఉప్పు తినడం వలన కలిగే లాభాలు వివరించారు.