అయిదు డిఎ లు పెండింగ్ లో ఉండగా ప్రస్తుతం ఒక డిఎ మాత్రమే విడుదల చేయడం విచారకరమని, ప్రభుత్వం పునరాలోచన చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాద్యాయ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణారెడ్డి, నరసింహ అన్నారు. ఆదివారం నారాయణపేటలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే సకాలంలో బకాయి పడిన మూడు డిఎ లను విడుదల చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారని గుర్తు చేశారు.