నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి అబాంగాపూర్ గ్రామంలో శెట్టి శివప్ప అనే మహిళకు చెందిన కిరాణా షాప్ లో 14 క్వింటాళ్ల పిడియస్ రైస్, అదే గ్రామానికి చెందిన శెట్టి చంద్రప్ప ఇంట్లో 2. 30 క్వింటాళ్ల పిడియస్ రైస్ అక్రమంగా నిల్వ ఉంచినందున టాస్క్ ఫోర్స్, రూరల్ పోలీసులు దాడులు నిర్వహించి 16.30 క్వింటాళ్ల పిడియస్ రైస్ పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇద్దరిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ రాముడు తెలిపారు.