కందుల ధర పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నారాయణపేట మార్కెట్ యార్డు కార్యాలయం ముందు రైతులు మళ్ళీ ఆందోళనకు దిగారు. సోమవారం నుండి ఆందోళనలు చేస్తున్న కొనుగోలు దారులు ధరలు పెంచడం లేదని రైతులు అంటున్నారు. క్వింటాలుకు ఏకంగా రెండు వేలు తగ్గించడం రైతులను నిండా ముంచడం అని అన్నారు. కనీసం రూ. 500 పెంచాలని కోరుతున్నారు. ఇందుకు కొనుగోలు దారులు అంగీకరించకపోవడంతో రైతులు మళ్ళీ ఆందోళనకు దిగారు.