రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరి అన్నారు. ఆదివారం ధన్వాడ మండల కేంద్రంలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.