నారాయణపేట: బాల సదన్ ను సందర్శించిన కలెక్టర్

58பார்த்தது
నారాయణపేట: బాల సదన్ ను సందర్శించిన కలెక్టర్
నారాయణపేట పట్టణంలోని బాల సదన్ ను శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. గదులను, వంట రూమ్, పరిసరాలను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. బాలలకు నాణ్యమైన భోజనం అందించాలని, వారి ఆరోగ్యంపట్ల శ్రద్ధ చూపాలని చెప్పారు. బాల సదన్ లో కొత్తగా గదులు నిర్మించేందుకు స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి జయ, సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி