అచ్చంపేట మండలం ఉమామహేశ్వర ఆలయ పరిసరాలలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండలపై నుండి జలపాతాలు జాలువారుతూ భక్తులను కనువిందు చేస్తున్నాయి. ఉమామహేశ్వర స్వామి ఆలయ పరిసరాలలో జలపాతాలు జాలు వారు తుండడంతో భక్తులు ఎంతో ఆనందోత్సహాల మధ్య పరవశానికి లోనవుతున్నారు. వర్షాలకు తడిసి కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ఆలయ సిబ్బంది భక్తులను జలపాతాల సమీపానికి వెళ్ళవద్దని హెచ్చరిస్తున్నారు.