అధిక సాంద్రత పత్తి సాగు యాజమాన్య పద్ధతి పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని కృషి విజ్ఞాన కేంద్రం పాలెం శాస్త్రవేత్త కెవికె ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఉప్పునుంతల మండలం కొరటికల్, తిప్పాపూర్, తాడూరు గ్రామాల్లోని రైతులకు గురువారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు.