విద్యార్థులతో రాజకీయం చేయడం సరైంది కాదని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్ధేశించి అన్నారు. అసెంబ్లీలో మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ గురించి ప్రతిపక్షాలు ప్రశ్నించడంతో ఎమ్మెల్యే సమాధానం చెప్పారు. ఫుడ్ పాయిజన్ జరిగిన సందర్భంలో విద్యార్థులకు ధైర్యం కల్పించేందుకు అందరం అదే పాఠశాలలో భోజనం చేశామని, బిఆర్ఎస్ నాయకులు ఫోటోలు దిగి ఇంట్లో భోజనం చేశారని అన్నారు.