మక్తల్ పట్టణంలో బుధవారం అయ్యప్ప స్వామి 42వ మహా పడి పూజ వైభవంగా నిర్వహించారు. మొదట అయ్యప్ప స్వామి ఉత్సవ మూర్తి, కళశలతో పుర విధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గురు స్వాముల ఆధ్వర్యంలో గణపతి పూజ, మెట్ల పూజ, అయ్యప్ప స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేసి మహా మంగళ హారతులు సమర్పించారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మహా పూజలో పాల్గొని స్వామి వారికి పూజలు చేశారు. ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.