రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. జూరాల ప్రాజెక్టు కింద సాగు చేస్తున్న పంటలకు నారాయణపూర్ డ్యాం నుండి నీటిని విడుదల చేయించిన సందర్భంగా ఎమ్మెల్యేను బుధవారం మక్తల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రైతులు పూలమాలలు, శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల అవసరాలకు నీటిని విడుదల చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.