మహబూబ్ నగర్ పట్టణంలోని పవనపుత్ర కాలనీలో ఆదివారం ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి నూతన డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.