కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా అన్నారం గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడు మెరుగు నారాయణరెడ్డి శుక్రవారం నియమితులయ్యారు. నారాయణరెడ్డి అనేక సంవత్సరాలుగా యువజన కాంగ్రెస్ లో చురుకైన నాయకునిగా, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో క్రియశీలకంగా పనిచేయడం జరిగింది. నారాయణ రెడ్డి మాట్లాడుతూ నా నియామకానికి కృషి చేసిన వంశీకృష్ణకి, తదితరులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.