వినాయక నిమజ్జనానికి వచ్చే ప్రజలు ఏ మాత్రం తొందరపడకుండా నిదానంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా పురపాలక పరిధిలోని అప్పన్నపల్లి చెరువు వద్ద నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు. పిల్లలు చెరువులోకి వెళ్లకుండా చూసుకోవాలన్నారు.