మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులపై బెదిరింపులు అధికమవుతున్నాయని, నాయకులపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని గురువారం డీజీపీ జితేందర్ కు బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షులు యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.