క్షేత్రస్థాయిలో బలపడితేనే పార్టీకి లాభం: డీకే అరుణ

71பார்த்தது
క్షేత్రస్థాయిలో బలపడితేనే పార్టీకి లాభం: డీకే అరుణ
క్షేత్రస్థాయిలో బలపడితేనే పార్టీకి బలమని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొడంగల్ మండలంలోని అన్నారం గ్రామంలో సోమవారం ప్రారంభించారు. గ్రామాల్లో కార్యకర్తలు ఎక్కువగా ఉన్నప్పుడే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీకి పట్టు వస్తుందని ఆమె అన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరు బీజేపీ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி