నవాబుపేట మండల ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కొక్కళ్ళ రాఘవేంద్ర ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ అమలు పరిచిన కుటుంబ భరోసా అప్లికేషన్ పత్రాలను బుధవారం పంపిణి చేశారు. జనవరి 10న కుటుంబ భరోసాకు దరఖాస్తుకు జత చేసుకోవడానికి ఆధార్ కార్డు, నామిని ఆధార్, అసోసియేషన్ ఐడి, రెండు పాస్ ఫోటోలను జత చేసి మండల అసోసియేషన్ వాట్సాప్ లో పేరు నమోదు చేసుకోవాలని రాఘవేంద్ర తెలిపారు.