పాలమూరు ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులు, పనుల పురోగతిని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు బుధవారం పరిశీలించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లపూర్, వట్టెం, ఉదండాపూర్ జలాశయాలను సందర్శించనున్నారు. అనంతరం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై నీటి పారుదలశాఖతో పాటు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.