మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 30న నిర్వహించే 'ప్రజాపాలన విజయోత్సవ' సభ ఏర్పాట్లను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం అధ్యక్షుడు జి. చెన్నారెడ్డి ఆదివారం సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.