మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శానిటేషన్ పనులపై జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ), మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి శివేంద్ర ప్రతాప్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. మంగళవారం పట్టణంలోని డంపింగ్ యార్డ్, స్లాటర్ హౌస్, పాత దవాఖాన ఏరియాలో నిర్వహిస్తున్న శానిటేషన్ పనుల్ని పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి సమస్యలకు తావులేకుండా పనుల్ని చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డిని ఆదేశించారు.