విదేశీ బంగారాన్ని జడ్చర్ల-హైదరాబాద్ జాతీయ రహదారి రాయికల్ టోల్ ప్లాజా వద్ద డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. వివరాల ప్రకారం. శనివారం రాయికల్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాలను చెక్ చేస్తుండగా దాదాపు 4. 7 కిలోల బంగారం పట్టుబడింది. దీని విలువ రూ. 3. 71 కోట్లు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. బంగారాన్ని కోయంబత్తూర్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా రవాణా చేస్తున్నారని, ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండు తరలించామన్నారు.