మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని ఫతేపూర్ మైసమ్మ దేవాలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం గురువారం ఉ. 10: 00 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమానికి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హాజరుకానున్నారు. అనంతరం బాలానగర్ మండల కేంద్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని వ్యక్తిగత కార్యదర్శి బాలు తెలిపారు. ఈ కార్యక్రమాలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.