వడ్డేపల్లి మండల పరిధిలోని జులకల్ గ్రామంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు జులకల్ గ్రామ స్టేజ్ సమీపంలో బైక్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.