తిరుమల లడ్డూ అపవిత్రతపై సోమవారం జిల్లా కేంద్రమైన గద్వాలలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని సంతాన వేణుగోపాలస్వామి ఆలయం నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. లడ్డూను అపవిత్రం చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని కోరారు.